Highlights
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద, అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడును :-
- ట్యూషన్ ఫీజు కొరకు Rs. 20,00,000/- స్కాలర్షిప్ ఇవ్వబడును.
- విద్యార్థుల ఎకానమీ క్లాస్ ఏ టికెట్ కోసం అత్యధికంగా Rs. 50,000/- ఇవ్వబడును.
Customer Care
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-24754811.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం హెల్ప్ డెస్క్ ఇమెయిల్ :- tbsp.telangana@gmail.com.
Information Brochure
పథకం వివరణ
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 2018. |
లబ్ధిదారులు | తెలంగాణ బ్రాహ్మణ విద్యార్థులు. |
సబ్స్క్రిప్షన్ | పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
నోడల్ ఏజెన్సీ | తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ |
అప్లై చేసే పద్ధతి | తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. |
పరిచయం
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రధాన విద్యాసంస్కరణ పథకం.
- ఇది 2018 లో ప్రారంభించబడింది.
- ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో పై చదువులు చదవడానికి విద్యార్థులకు ఆర్థిక సహకారాన్ని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
- తెలంగాణ ప్రభుత్వం యొక్క బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఈ పథకాన్ని అమలు చేసే సంస్థ.
- ఈ పథకాన్ని “తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం” అని కూడా అంటారు.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద, తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేయబడ్డ విద్యార్థులకు Rs. 20,00,000/- వరకు స్కాలర్షిప్ ను అందజేస్తుంది.
- స్కాలర్షిప్ తో పాటు, తెలంగాణ ప్రభుత్వం వన్వే ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్ ఖర్చుల కోసం అత్యధికంగా Rs. 50,000/- అందజేస్తుంది.
- బ్రాహ్మణ వర్గానికి చెందిన విద్యార్థులు మాత్రమే తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి అప్లై చేయడానికి అర్హులు.
- పథకానికి అప్లై చేసే ముందు, TOEFL/ IELTS/ GRE/ GMAT/ PTE లో, ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణులవడం తప్పనిసరి.
- కింద ఇవ్వబడిన కోర్సులకు మాత్రమే స్కాలర్షిప్ అందజేయబడును :-
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్.
- డాక్టోరల్ కోర్స్.
- వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి విద్యార్థులను ఎంపిక చేయడానికి కింద ఇవ్వబడిన ఉత్తీర్ణత వెయిటేజ్ పరిగణలోకి తీసుకోబడుతుంది :-
- డిగ్రీ మార్కులు :- 60%.
- GRE/GMAT మార్కులు :- 20%.
- IELTS/ TOEFL మార్కులు :- 20%.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద 10 దేశాల విశ్వవిద్యాలయాలు అనగా USA, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనాడా, సింగపూర్, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, మరియు సౌత్ కొరియా లలో ఉన్న విశ్వవిద్యాలయాలు పరిగణలోకి తీసుకోబడతాయి.
- ఈ పథకం కింద స్కాలర్షిప్ దశలవారీగా విడుదల చేయబడుతుంది.
- అర్హత కలిగిన విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం తెలంగాణ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి అప్లై చేయ వచ్చు.
లాభాలు
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద, అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడును :-
- ట్యూషన్ ఫీజు కొరకు Rs. 20,00,000/- స్కాలర్షిప్ ఇవ్వబడును.
- విద్యార్థుల ఎకానమీ క్లాస్ ఏ టికెట్ కోసం అత్యధికంగా Rs. 50,000/- ఇవ్వబడును.
అర్హత
- విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి.
- విద్యార్థులు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారై ఉండాలి.
- విద్యార్థుల సంవత్సర కుటుంబా ఆదాయం Rs. 5,00,000/- మించి ఉండరాదు.
- విద్యార్థులు కింద ఇవ్వబడిన ఏదో ఒక పరీక్షలో కింద ఇవ్వబడిన మార్కుల తో ఉత్తీర్ణులై ఉండాలి :-
- TOEFL - 60.
- IELTS - 6.0.
- GRE - 260.
- GMAT - 500.
- PTE - 50.
- దరఖాస్తుదారులు 18 నుండి 24 నెలల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ లేదా డాక్టోరల్ కోర్స్ కోసం అడ్మిషన్ తీసుకొని ఉండాలి.
స్కాలర్షిప్ కొరకు అర్హత కలిగిన దేశాలు
- కింద ఇవ్వబడిన దేశాలలోని విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ వస్తే విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు అర్హులు :-
- USA.
- UK.
- ఆస్ట్రేలియా.
- కెనడా.
- సింగపూర్.
- జర్మనీ.
- న్యూజిలాండ్.
- జపాన్.
- ఫ్రాన్స్.
- సౌత్ కొరియా.
అవసరమైన పత్రాలు
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కింద ఇవ్వబడిన పత్రాలు అవసరం అవుతాయి :-
- నివాస ధ్రువీకరణ పత్రం.
- ఆధార్ కార్డు.
- పాస్పోర్ట్.
- వీసా.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో.
- క్యాస్ట్ సర్టిఫికెట్.
- ఇన్కమ్ సర్టిఫికెట్.
- 10 వ, 12 వ, గ్రాడ్యుయేషన్, మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ (వర్తించే విధంగా)
- TOEFL/ IELTS/ PTE/ GRE/ GMAT స్కోర్ కార్డు.
- యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్.
- బ్యాంకు ఖాతా వివరాలు.
అప్లై చేసే విధానం
- అర్హత కలిగిన విద్యార్థులు స్కాలర్షిప్ కోసం తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి అప్లై చేయాలి.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ఆన్లైన్ అప్లికేషన్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పోర్టల్ లో లభిస్తుంది.
- ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి.
- ఆధార్ కార్డు ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత, లబ్ధిదారులైన విద్యార్థులు కింద ఇవ్వబడిన వివరాలను అప్లికేషన్ ఫామ్ లో నింపాలి :-
- వ్యక్తిగత వివరాలు.
- పుట్టిన తేదీ.
- పుట్టిన స్థలం.
- స్కూలు/ కాలేజ్/ యూనివర్సిటీ వివరాలు.
- తల్లిదండ్రుల వివరాలు.
- తోబుట్టువుల వివరాలు.
- కుటుంబ ఆదాయ పరిస్థితి.
- క్యాస్ట్ సర్టిఫికెట్ వివరాలు.
- ఇన్కమ్ సర్టిఫికెట్ వివరాలు.
- బ్యాంకు ఖాతా వివరాలు.
- GRE/ IELTS/ TOEFL/ PTE/ GMAT వివరాలు.
- విదేశాలలో చదవబోయే కోర్సు వివరాలు.
- పాస్పోర్ట్ వివరాలు.
- వీసా వివరాలు.
- అవసరమైన పత్రాలు అన్ని అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలను నింపి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- కమిటీ సభ్యులు, వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం అప్లికేషన్ ఫామ్స్ మరియు పత్రాలను పరిశీలిస్తారు.
- వివరాలను ధృవీకరించిన తర్వాత, తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద స్కాలర్షిప్ ను దశలవారీగా విడుదల చేస్తారు.
ముఖ్యమైన లింక్స్
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం రిజిస్ట్రేషన్.
- తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పోర్టల్.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం మార్గదర్శకాలు.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి అర్హత కలిగిన యూనివర్సిటీస్ లిస్ట్.
సంప్రదింపు వివరాలు
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-24754811.
- తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం హెల్ప్ డెస్క్ ఇమెయిల్ :- tbsp.telangana@gmail.com.
- తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్,
3 వ అంతస్తు, ధార్మిక భవనం,
తిలక్ రోడ్, బొగ్గులకుంట,
హైదరాబాద్ - 500001.
Scheme Forum
Caste | Person Type | Scheme Type | Govt |
---|---|---|---|
Matching schemes for sector: Scholarship
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | National Means Cum Merit Scholarship Scheme | CENTRAL GOVT | |
2 | Swanath Scholarship Scheme | CENTRAL GOVT | |
3 | Pragati Scholarship Scheme | CENTRAL GOVT | |
4 | Saksham Scholarship Scheme | CENTRAL GOVT | |
5 | Ishan Uday Special Scholarship Scheme | CENTRAL GOVT | |
6 | Indira Gandhi Scholarship Scheme for Single Girl Child | CENTRAL GOVT | |
7 | Central Sector Scheme of Scholarship | CENTRAL GOVT | |
8 | North Eastern Council (NEC) Merit Scholarship Scheme | CENTRAL GOVT | |
9 | PM Yasasvi Scheme | CENTRAL GOVT | |
10 | Central Sector Scholarship Scheme Of Top Class Education For SC Students | CENTRAL GOVT | |
11 | CBSE Single Girl Child Scholarship Scheme | CENTRAL GOVT |
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం
Comments
telangana overseas…
telangana overseas scholarship documents requirements
only for upper caste
only for upper caste
Any scholarship for England…
Any scholarship for England student
వ్యాఖ్యానించండి