Highlights
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కింద, 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతినెలకు 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
Website
Customer Care
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం యొక్క హెల్ప్ లైన్ నెంబర్, సంబంధిత అధికారుల చేత త్వరలో విడుదల చేయబడుతుంది.
పథకం వివరాలు |
|
---|---|
పథకం పేరు | ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 2024. |
లాభాలు | నెలకు 1,500/- రూపాయల ఆర్థిక సహకారం |
లబ్ధిదారులు | రాష్ట్ర మహిళలు. |
నోడల్ విభాగం | ఈ వివరాలు ప్రస్తుతానికి తెలియదు. |
సబ్స్క్రిప్షన్ | పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
అప్లై చేసే విధానం | దరఖాస్తుదారులు ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ ఫామ్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. |
పరిచయం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దరఖాస్తుదారులకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి “ఏపీ ఆడబిడ్డ నిధి పథకాన్ని” ప్రకటించింది.
- ఈ పథకం కింద, ఆంధ్ర ప్రదేశ్ లోని అర్హులైన మహిళలు ప్రతి నెలకు 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని అందుకుంటారు.
- ఈ పథకం కింద అందజేయబడే ఆర్థిక సహకారం, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి డిబిటి మోడ్ ద్వారా ప్రత్యక్షంగా జమ చేయబడుతుంది.
- ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన “ఏపీ ఆడబిడ్డ నిధి పథకం” ను “ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం” అని కూడా అంటారు.
- మీకందరికీ తెలిసిన విధంగా, ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ప్రకటించబడిన ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా, టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేయబడింది.
- టిడిపి మరియు కూటమి పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించారు కాబట్టి, ఈ పథకం యొక్క లబ్ధిదారులు పథకం అమలు కొరకు వేచి చూస్తున్నారు.
- ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే, దరఖాస్తుదారులు ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం మార్గదర్శకాలు మరియు అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి.
- కానీ, పథకం ప్రకటించే సమయంలో, ఏపీ ప్రభుత్వం పథకం యొక్క ముఖ్యమైన వివరాలను తెలియజేయలేదు. పథకాన్ని అమలుపరిచిన తర్వాత వాటిని విడుదల చేసే అవకాశం ఉంది.
- ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, పథకం యొక్క లాభాలు రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే వర్తిస్తాయి.
- అదనంగా, మహిళా దరఖాస్తుదారుల వయసు 19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా బలపరచడమే ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
- ఈ పథకం యొక్క లాభాలను పొందడానికి, దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫామ్ను ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి.
- ఒకవేళ దరఖాస్తుదారులు ఇటువంటి ఆర్థిక సహకారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అమలుపరిచే ఇతర పథకాల ద్వారా పొందితే, ఈ పథకం నుండి మినహాయింపబడతారు.
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం యొక్క వివరాత్మకమైన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇక్కడ అప్డేట్ చేస్తాము.
- ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం లేదా ఆడబిడ్డ నిధి పథకం యొక్క లేటెస్ట్ అప్డేట్లను పొందడానికి, ఇక్కడ మా పేజ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
పథకం లాభాలు
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కింద, 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతినెలకు 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
అర్హత పరిస్థితులు
- లబ్ధిదారులు ఏపీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా, ప్రతి నెలకు, 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని పొందాలంటే, కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను తప్పనిసరిగా కలిగి ఉండాలి :-
- ఈ పథకం రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.
- మహిళా దరఖాస్తుదారుల వయస్సు 19 నుండి 59 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.
- వేరే పథక లాభాలను పొందే మహిళలు ఈ పధకం లాభాలను పొందడానికి అర్హులు కారు.
అవసరమైన పత్రాలు
- పథకం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే సమయంలో, లబ్ధిదారులైన మహిళలు కింద ఇవ్వబడిన పత్రాలను తప్పనిసరిగా అందించాలి. (లిస్టులో ఏమైనా మార్పులు ఉంటే ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది) :-
- నివాస ధ్రువీకరణ పత్రం.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం.
- పాన్ కార్డు.
- వయసు ధ్రువీకరణ పత్రం.
- ఆధార్ కార్డు.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
- క్యాస్ట్ సర్టిఫికెట్.
అప్లై చేసే పద్ధతి
- అర్హత కలిగిన దరఖాస్తుదారులు “ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకానికి” అప్లై చేసుకోవచ్చు.
- కానీ, ఈ పథకాన్ని ప్రకటించే సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ పద్ధతి ద్వారా లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ పద్ధతి ద్వారా అప్లై చేయాలో స్పష్టంగా తెలియపరచలేదు.
- పథకం యొక్క అప్లికేషన్ వివరాలు దాని యొక్క మార్గదర్శకాలలో తెలియజేయబడుతాయి.
- ఏపీ ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ను సబ్మిట్ చేసే సమయంలో, దరఖాస్తుదారులు చెల్లుబాటులో ఉన్న వారి వివరాలను మరియు పత్రాలను అందజేయాలి.
- సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లకు పరిశీలన పరీక్ష చేయబడుతుంది. పరీక్షను క్లియర్ చేసిన అప్లికేషన్లు మాత్రమే పథకం యొక్క లాభాలను పొందుతాయి.
- పథకం అప్లికేషన్ కు సంబంధించిన సాధారణ ప్రక్రియను ఇక్కడ తెలియజేశాము. వివరణాత్మకమైన అప్లికేషన్ వివరాలను విడుదల చేసిన వెంటనే ఇక్కడ అప్డేట్ చేస్తాము.
ముఖ్యమైన లింక్స్
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ ఫామ్ త్వరలో విడుదల చేయబడుతుంది.
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు సంబంధిత అధికారుల చేత త్వరలో విడుదల చేయబడతాయి.
- ఆడబిడ్డ నిధి పథకం అధికారిక వెబ్సైట్ వివరాలు ఇంకా తెలియజేయాల్సి ఉంది.
సంప్రదింపు వివరాలు
- ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం యొక్క హెల్ప్ లైన్ నెంబర్, సంబంధిత అధికారుల చేత త్వరలో విడుదల చేయబడుతుంది.
Scheme Forum
Person Type | Scheme Type | Govt |
---|---|---|
Matching schemes for sector: Fund Support
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ చేయూత పథకం | ఆంధ్రప్రదేశ్ | |
2 | ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాపు నేస్తం పథకం | ఆంధ్రప్రదేశ్ | |
3 | YSR EBC Nestham Scheme | ఆంధ్రప్రదేశ్ | |
4 | Jagananna Chedodu Scheme | ఆంధ్రప్రదేశ్ | |
5 | YSR Nethanna Nestham Scheme | ఆంధ్రప్రదేశ్ | |
6 | YSR Vahana Mitra Scheme | ఆంధ్రప్రదేశ్ | |
7 | Jagananna Thodu Scheme | ఆంధ్రప్రదేశ్ | |
8 | ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం | ఆంధ్రప్రదేశ్ | |
9 | ఆంధ్ర ప్రదేశ్ తల్లికి వందనం స్కీమ్ | ఆంధ్రప్రదేశ్ | |
10 | ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ బృతి పథకం | ఆంధ్రప్రదేశ్ | |
11 | Andhra Pradesh Annadata Sukhibhava Scheme | ఆంధ్రప్రదేశ్ |
Matching schemes for sector: Fund Support
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | Pradhan Mantri Awas Yojana(PMAY) – Housing for All | CENTRAL GOVT | |
2 | Yudh Samman Yojana | CENTRAL GOVT | |
3 | Nikshay Poshan Yojana | CENTRAL GOVT |
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం
Comments
allowance
allowance
వ్యాఖ్యానించండి