Highlights
- 3 వీలర్ ఆటో కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వబడును.
- త్రీ వీలర్ వాహనం అసలు ధరపై 50 శాతం సబ్సిడీ ఇవ్వబడును.
- మిగిలిన 50% ధరకు బ్యాంకులోను మంజూరు చేయబడును.
Website
Customer Care
- తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23244501.
- తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- tsmfcinfo@gmail.com.
- తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ ఈమెయిల్ :- helpdesk.obms@cgg.gov.in.
Information Brochure
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ మీ సొంత ఆటో పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 2015. |
లబ్ధిదారులు | తెలంగాణ మైనారిటీ యువకులు. |
లాభాలు | 3 వీలర్ ఆటో కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ. |
నోడల్ విభాగం | మైనారిటీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం. |
సబ్స్క్రిప్షన్ | పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. |
అప్లై చేయు విధానం | తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. |
పరిచయం
- సొంత ఆటో పథకం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రముఖమైన ఉపాధి కల్పన పథకం.
- ఇది 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది.
- తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ విభాగం ఈ పథకం యొక్క నోడల్ విభాగం.
- మైనారిటీ యువకులకు సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడమే తెలంగాణ సొంత ఆటో పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఏరియా (GHMC) లోని చాలా ప్రదేశాలలో మైనారిటీ కి చెందిన చదువుకున్న యువత ఆటోరిక్షాలు నడుపుతున్నారు.
- అందులో చాలామందికి సొంత ఆటోలు లేవు. వారు ఆటోలను అద్దెకు తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు.
- ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం 3 వీలర్ ఆటో కొనుగోలుపై 50% సబ్సిడీ అందిస్తుంది.
- త్రీ వీలర్ కొనుగోలుపై, మిగిలిన 50 శాతం ఖర్చుకు, లోను సౌకర్యం కూడా కలదు.
- కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (CNG) లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) మీద నడిచే మూడు సీట్ల సౌకర్యం కలిగిన త్రి వీలర్ వాహనాల కొనుగోలు పై మాత్రమే ఈ సబ్సిడీ లభించును.
- సొంత ఆటో పథకం కింద సబ్సిడీ పొందడానికి, లబ్ధిదారులు కింద ఇవ్వబడిన ఆటో రిక్షాలపై అప్లై చేయ వచ్చును :-
ఆటో కంపెనీ మోడల్ TVS - TVS KING 4S CNG ELECTRIC START.
- TVS KING 4S LPG ELECTRIC START.
BAJAJ - RE-COMPACT CNG 2S.
- RE-COMPACT LPG 2S.
PIAGGIO - APE CITY CNG (4 STROKE).
- APE CITY LPG (4 STROKE).
- మైనారిటీ కమ్యూనిటీ చెందిన, 21 - 55 సంవత్సరాల వయసు కలిగిన వారు, తెలంగాణ సొంత ఆటో పథకం కింద ఆటో రిక్షా కొనుగోలుకై అర్హులు.
- దరఖాస్తుదారుల కుటుంబ సంవత్సర ఆదాయం Rs. 2,00,000/- కన్నా తక్కువ ఉండాలి.
- లోను వడ్డీ రేటు బ్యాంకు వడ్డీ రేటును బట్టి ఉంటుంది.
- సబ్సిడీకి అప్లై చేయు సమయంలో దరఖాస్తుదారులకు చెల్లుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- CNG మరియు LPG ఆటో రిక్షాలపై మాత్రమే తెలంగాణ సొంత ఆటో పథకం కింద సబ్సిడీ ఇవ్వబడుతుంది.
- అర్హులైన లబ్ధిదారులు ఆటో రిక్షా కొనుగోలుపై సబ్సిడీ కోసం తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
పథకం లాభాలు
- 3 వీలర్ ఆటో కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వబడును.
- త్రీ వీలర్ వాహనం అసలు ధరపై 50 శాతం సబ్సిడీ ఇవ్వబడును.
- మిగిలిన 50% ధరకు బ్యాంకులోను మంజూరు చేయబడును.
అర్హత
- దరఖాస్తుదారులు తెలంగాణ నివాసులై ఉండాలి.
- దరఖాస్తుదారులకు 3 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- దరఖాస్తుదారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నివసిస్తూ ఉండాలి.
- దరఖాస్తుదారులు కింద ఇవ్వబడిన మైనారిటీ వర్గానికి చెందిన వారై ఉండాలి :-
- ముస్లింలు.
- బుద్ధులు.
- సిక్కులు.
- పార్శీలు.
- క్రిస్టియన్లు.
- జైన్లు.
- దరఖాస్తుదారుల వయస్సు 21 నుండి 55 మధ్యలో ఉండాలి.
- దరఖాస్తుదారుల కుటుంబ సంవత్సర ఆదాయం Rs. 2,00,000/- కు మించి ఉండరాదు.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు.
- 3 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్.
- 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం.
- బ్యాంకు ఖాతా వివరములు.
- నివాస ధ్రువీకరణ కోసం కింద ఇవ్వబడిన ఏదో ఒక పత్రం :-
- రేషన్ కార్డు.
- డ్రైవింగ్ లైసెన్స్.
- ఓటర్ ID కార్డు.
- ఆధార్ కార్డు.
- బ్యాంకు పాస్ బుక్.
అప్లై చేయు విధానం
- అర్హులైన లబ్ధిదారులు తెలంగాణ సొంత ఆటో పథకం ద్వారా త్రీ వీలర్ కొనుగోలుపై సబ్సిడీ పొందడానికి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
- తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ పోర్టల్ లో లభిస్తుంది.
- దరఖాస్తుదారులు తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో కింద ఇవ్వబడిన వివరాలను నింపాలి :-
- వ్యక్తిగత వివరాలు.
- సంప్రదింపు వివరాలు.
- బ్యాంకు ఖాతా వివరాలు.
- ఎంచుకున్న ఆటో వివరాలు.
- అవసరమైన పత్రాలు.
- తరువాత, సొంత ఆటో పథకం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ మరియు అవసరమైన పత్రాలను మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క బ్రాంచ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.
- సంబంధిత అధికారులు అప్లికేషన్ ఫామ్ మరియు పత్రాలను నిశితంగా పరిశీలిస్తారు.
- పరిశీలించిన తర్వాత, ఎంపిక చేయబడ్డ దరఖాస్తుల అప్లికేషన్ ఫామ్, అనుమతి కోసం ట్రాన్స్పోర్ట్ విభాగానికి మరియు లోను కోసం బ్యాంకుకు పంపిస్తారు.
- దరఖాస్తుదారుల మొబైల్ ఫోన్ కు, తమ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్సిడీ గురించి తీసుకోబడిన నిర్ణయాలు మరియు వివరాలు పంపబడుతాయి.
ముఖ్యమైన లింక్స్
- తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్.
- తెలంగాణ మీ సొంత ఆటో పథకం అప్లికేషన్ స్థితి.
- తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ.
- తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పోర్టల్.
- తెలంగాణ మీ సొంత ఆటో పథకం మార్గదర్శకాలు.
సంప్రదింపు వివరాలు
- తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23244501.
- తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- tsmfcinfo@gmail.com.
- తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ ఈమెయిల్ :- helpdesk.obms@cgg.gov.in.
- రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ,
5th ఫ్లోర్, హజ్ హౌస్,
నాంపల్లి, హైదరాబాద్.
500001.
Scheme Forum
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about తెలంగాణ మీ సొంత ఆటో పథకం
Comments
not for st own auto scheme
not for st own auto scheme
I want e rickshaw
I want e rickshaw
Dear sir please I need auto…
Dear sir please I need auto ricksha
e auto or petrol diesel
e auto or petrol diesel
Auto riksha
Auto riksha
E auto Mahindra purchase
E auto Mahindra purchase
Gas Aato
Asalam walekum sir kysa apply karna sir
I want auto loan
I want auto loan
government subsidy vehicle…
government subsidy vehicle scheme in telangana
I want electric auto in…
I want electric auto in Telangana scheme
driver com owner pathakam…
driver com owner pathakam telangana
SC St auto scheme telangana
SC St auto scheme telangana
Auto loan
Auto loan
Need auto for employment
Need auto for employment
vehicle subsidy for sc st
vehicle subsidy for sc st
electric loading auto for…
electric loading auto for work subsidy
i am sc i want my auto in…
i am sc i want my auto in own your auto scheme
Auto loan
(No subject)
(No subject)
Sir why my loan is not…
Sir why my loan is not sanctioned
auto loan
auto loan
SC ST.auto lone for subsidiary
Need auto or car schem for SC st commission
Pass my auto loan
Pass my auto loan
Auto loan
Auto loan
i need loan to purchase my…
i need loan to purchase my auto
subsidy for women
subsidy for women
i want to purchase my own…
i want to purchase my own auto
వ్యాఖ్యానించండి