తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం

author
Submitted by shahrukh on Fri, 05/07/2024 - 15:31
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం కింద మహిళా అబ్ధిదారులకు కింద ఉన్న లాభాలను అందిస్తున్నారు :-
    • అబ్బాయి జన్మించినపుడు ఆర్ధిక సహాయంగా 12,000/- రూ అందిస్తున్నారు.
    • అమ్మాయి జన్మించినపుడు ఆర్ధిక సహయంగా 13,000/- రూ అందిస్తున్నారు.
    • తల్లి మరియు బిడ్డ కోసం వారికి అవసరమైన 16 వస్తువులతో కూడిన ఎంసిహెచ్ కిట్ ను అందిస్తున్నారు
Customer Care
పథకం వివరాలు
పథకం తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం.
ప్రారంభమైన తేది 2, జూన్, 2017.
లాభాలు
  • అబ్బాయి జన్మించినపుడు ఆర్ధిక సహాయంగా 12,000/- రూ అందిస్తున్నారు.
  • అమ్మాయి జన్మించినపుడు ఆర్ధిక సహయంగా 13,000/- రూ అందిస్తున్నారు.
  • తల్లి మరియు బిడ్డ కోసం వారికి అవసరమైన 16 వస్తువులతో కూడిన ఎంసిహెచ్ కిట్ ను అందిస్తున్నారు.
లబ్ధిదారులు తెలంగాణ లోని గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులు.
నోడల్ విభాగం తెలంగాణ లోని ఆరోగ్య, విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగాలు.
సుబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాలు కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
ధారకాస్తు విధానం తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం ధారకాస్తు ఫారం.

పరిచయం

  • తెలంగాణ ప్రభుత్వ యొక్క ప్రధాన పథకం ఎంసిహెచ్ కిట్ పథకం.
  • ఈ పథకం జూన్ 2, 2017న ప్రారంభించబడింది మరియు జూన్ 4, 2017 నుండి అమలులోకి వచ్చింది.
  • పథకం యొక్క ప్రధాన లక్ష్యం :-
    • గర్భధారణ మరియు డెలివరీ సమయంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం.
    • బిడ్డ జన్మించడాన్ని పబ్లిక్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ప్రోత్సహించడం.
    • అప్పుడే జన్మించిన శిశువుకు పూర్తి రోగనిరోధక శక్తిని అందించడం.
    • ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించడం.
  • ఈ పథకం తెలంగాణలోని పబ్లిక్/ ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ద్వారా జనన పూర్వ మరియు ప్రసవానంతర కాలంలో ఆరోగ్య సేవలు పొందే గర్భిణీ స్త్రీలందరికీ వర్తిస్తుంది.
  • స్త్రీ లబ్దిదారులకు పుట్టిన బిడ్డ మగపిల్లలైతే వారికి ఆర్థిక సహాయం గా రూ. 12,000/- అందించబడుతుంది.
  • స్త్రీ లబ్దిదారులకు పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే వారికి ఆర్థిక సహాయం గా రూ. 13,000/- అందించబడుతుంది.
  • ఈ ఆర్థిక సాయాన్ని ఐదు విడతల్లో అందజేస్తారు.
  • ఈ ఆర్థిక సహాయం తల్లి మరియు బిడ్డ సంరక్షణ కోసం అందించబడుతుంది.
  • ఈ ఆర్థిక సాయంతో పాటు తల్లీ బిడ్డల కోసం 16 వస్తువులతో కూడిన ఎంసిహెచ్ కిట్‌ను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది.
  • ఈ కిట్ దాదాపు రూ. 15,000/- ఖరీదు చేస్తుంది.
  • ఈ కిట్ యొక్క కంటెంట్ 3 నెలల ఉపయోగపడుతుంది.
  • ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్ పథకం పేరును మార్చింది.
  • ఇప్పుడు కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ఎంసీహెచ్‌ కిట్‌ పథకంగా పిలుస్తున్నారు.
  • ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు తెలంగాణ మహిళా లబ్ధిదారులు మాత్రమే అర్హులు.
  • తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం యొక్క ప్రయోజనాలు ప్రభుత్వ/ ప్రభుత్వ ఆసుపత్రిలో తన బిడ్డకు జన్మనిచ్చిన మహిళా లబ్ధిదారులకు మాత్రమే అందజేయబడుతుంది.
Telangana MCH Kit Scheme Registered Beneficiary

పథకం యొక్క ప్రయోజనాలు

  • తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం కింద మహిళా అబ్ధిదారులకు కింద ఉన్న లాభాలను అందిస్తున్నారు :-
    • అబ్బాయి జన్మించినపుడు ఆర్ధిక సహాయంగా 12,000/- రూ అందిస్తున్నారు.
    • అమ్మాయి జన్మించినపుడు ఆర్ధిక సహయంగా 13,000/- రూ అందిస్తున్నారు.
    • తల్లి మరియు బిడ్డ కోసం వారికి అవసరమైన 16 వస్తువులతో కూడిన ఎంసిహెచ్ కిట్ ను అందిస్తున్నారు
Telangana MCH Kit Scheme Benefits

ఎంసిహెచ్ కిట్ యొక్క పంపిణీ విధానం

  • 2 ANC చెకప్‌లను పూర్తి చేసిన తర్వాత ఎల్ఎంపి తేదీ నుండి 5.5 నెలలలోపు లబ్ధిదారుని ఖాతాలో 3,000/- జమ చేయబడుతుంది.
  •  పుట్టిన బిడ్డ మగపిల్లలైతే ప్రసవం తర్వాత లబ్ధిదారుని ఖాతాలో రూ. 4,000/- జమ చేయబడుతుంది.
  • పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే డెలివరీ తర్వాత రూ. 5,000/- లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
  • మొదటి ఇమ్యునైజేషన్ తర్వాత (డెలివరీ అయిన 3 నెలలలోపు) లబ్ధిదారుని ఖాతాలో రూ. 2,000/- జమ చేయబడుతుంది.
  • రెండవ ఇమ్యునైజేషన్ తర్వాత (డెలివరీ అయిన 9 నెలలలోపు) లబ్ధిదారుని ఖాతాలో రూ. 3,000/- జమ చేయబడుతుంది.
  • పుట్టినబిడ్డ మగబిడ్డ అయితే ప్రభుత్వం మొత్తం రూ. 12,000/- ఇస్తుంది మరియు ఆడపిల్ల అయితే రూ. 13,000/-  ఇస్తుంది.

ఎంసిహెచ్ కిట్ లోని వస్తువుల జాబితా

  • క్రింద పేర్కొన్న రోజువారీ అవసరాలు ఎంసిహెచ్ కిట్‌లో ఉన్నాయి :-
    • తల్లి బిడ్డలకు ఉపయోగపడే సబ్బులు.
    • దోమల తెర.
    • చిన్న పిల్లలకు నూనె.
    • బేబీ కి బెడ్.
    • దుస్తులు.
    • తల్లికి చీర.
    • తువ్వాలు.
    • తల్లి కి హ్యాండ్ బ్యాగ్.
    • రుమాలు.
    • పౌడర్.
    • షాంపూ.
    • డైపర్లు.
    • పిల్లల కోసం బొమ్మలు.

అర్హత

  • తెలంగాణ ప్రభుత్వ ఎంసిహెచ్ కిట్ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కింది అర్హతలను షరతులను తెలుసుకొని ఉండాలి :-
    • ద్ర్రకాస్తు చేసుకునే మహిళా లబ్ధిదారు తెలంగాణలోని నివాసి అవ్వాలి.
    • ద్ర్రకాస్తు చేసుకునే మహిళా లబ్ధిదారునికి తప్పనిసరిగా తెలంగాణలో ఆధార్ కార్డు ఉండాలి.
    • 2 ప్రసవాల వరకు ఎంసిహెచ్ కిట్ ప్రయోజనాన్ని మహిళా లబ్ధిదారు గరిష్టంగా పొందవచ్చు.
    • పుట్టిన బిడ్డ ప్రసవం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే జరగాలి.

అనర్హత

  • క్రింద పేర్కొన్న కేటగిరీ లో కి ఏ మహిళ అయినా వస్తే, ఆమె తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు అనర్హులు :-
    • ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు లబ్దిదారుడికి ఉంటే ఈ స్కీమ్ వర్తించదు.
    • ప్రైవేటు ఆసుపత్రుల నుంచి లబ్ధిదారుడు చికిత్స తీసుకున్నట్లయితే ఈ స్కీమ్ వర్తించదు.
    • లబ్ధిదారుడి యొక్క ఆధార్ కార్డు తెలంగాణ రాష్ట్రానికి చెందినది కాకపోతే ఈ స్కీమ్ వర్తించదు.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ ఎంసిహెచ్ కిట్ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవాడినికి అవసరమైన పత్రాలు :-
    • ఆధారు కార్డు.
    • మొబైల్ నంబర్.
    • బ్యాంక్ ఖాతా వివరాలు.

ధారకాస్తు చేయు విధానం

  • ఎంసిహెచ్ కిట్ పథకం కింద తమ సమీపంలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ (పిహెచ్‌సి సెంటర్) లేదా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో.
  • లేదా ఆశా వర్కర్లకు లబ్దిదారుడు తమ వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.
  • ఈ నమోదు ప్రక్రియ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా లేదా సహాయక నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్ ఎం) ద్వారా జరుగుతుంది.
  • క్రింది వివరాలను సహాయక నర్సు మంత్రసాని గర్భిణీ స్త్రీల నుండి సేకరిస్తుంది :-
    • ఆధార్ కార్డు నంబరు.
    • పేరు.
    • వయస్సు.
    • చిరునామా.
    • ఫోను నంబరు.
    • ఎల్ఎంపి తేదీ.
    • నమోదు తేది.
    • బ్యాంక్ ఖాతా వివరాలు.
  • నమోదు పూర్తిచేసిన తర్వాత ఎంసిహెచ్ కిట్ పథకం దరఖాస్తు ఆమోదం కోసం వైద్యాధికారి దగ్గరకు వెళుతుంది.
  • మెడికల్ ఆఫీసర్ ఆమోదం తర్వాత, అప్లికేషన్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ ఆమోదం కోసం వెళుతుంది.
  • డిప్యూటీ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ ఆమోదం తర్వాత, దరఖాస్తు ఆర్థిక శాఖ ఆమోదం కోసం వెళుతుంది.
  • అన్ని ఆమోదాలు పొంది ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

పథకం యొక్క లక్షణాలు

  • ఎంసిహెచ్ కిట్ సంక్షేమ కార్యక్రమం కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది.
  • ఈ పథకాన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పరిచయం చేసారు.
  • ఈ పథకాన్ని ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసమే అమలు చేసారు.
  • ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గర్భధారణ సమయంలో, ప్రసవం అయిన తర్వాత సరైన సంరక్షణ కోసం మరియు చికిత్స అందించడం.
  • ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు 3 నెలల వరకు తల్లి, బిడ్డలకు కావాల్సిన అన్ని వస్తువులతో కూడిన ఎంసిహెచ్ కిట్‌ను అందజేస్తోంది.
  • ఎంసిహెచ్ కిట్‌లో తల్లి బిడ్డల్లాకు ఉపయోగపడే 16 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి :- బేబీ ఆయిల్, తల్లి మరియు బిడ్డకు ఉపయోగపడే సబ్బులు, దోమల తెర, డ్రెస్‌లు, హ్యాండ్‌బ్యాగ్, పిల్లల కోసం బొమ్మలు, డైపర్లు, పౌడర్, షాంపూ, చీర, టవల్, నేప్‌కిన్‌లు మరియు బేబీ బెడ్‌లు.
  • ఈ కిట్ దాదాపు రూ. 15,000/- లను ఖరీదు చేస్తుంది.
  • గర్భిణీ స్త్రీలు ఈ పథకాన్ని 2 ప్రసవాలకు వరకు సద్వినియోగం చేసుకోవచ్చు.
  • ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, గర్భిణీ స్త్రీలు తమ సమీపంలో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో నమోదు చేసుకోవాలి.
  • లబ్దిదారులు యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గర్భం యొక్క ప్రతి దశలో ఆమెకు మద్దతు లభిస్తుంది.
  • ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చడానికి ముందు మరియు తర్వాత అలాగే వారి యొక్క ఆరోగ్య స్థితిని ఎల్లప్పుడూ ట్రాక్ చేస్తూ మరియు పర్యవేక్షిస్తూంటారు.
  • గర్భిణులకు సమీపంలో ఉన్న ప్రజారోగ్య కేంద్రానికి వెళ్లేందుకు పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం కూడా ఉంది.
  • ఈ పథకంలో నవజాత శిశువు యొక్క ఆధారు కార్డు మరియు జనన ధృవీకరణ పత్రం కూడా తయారు చేసి ఇవ్వబడుతుంది.
  • లబ్ధిదారుడి ఖాతాలో కి ఆర్థిక సహాయం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అందించబడుతుంది, ఇది మొత్తం నేరుగా వారి ఖాతాలో కి బదిలీ చేయబడుతుంది.

జిల్లా స్థాయి సంప్రదించే వివరాలు

  • క్రింద ప్రోగ్రామ్ ఆఫీసర్-మెంటల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసిహెచ్) జిల్లా స్థాయి సంప్రదింపు వివరాలు ఉన్నాయి :-
    జిల్లా PO MCH
    కాంటాక్ట్ నెంబరు
    అదిలాబాదు 9492502862
    బద్రాది కొత్తగూడెం 9160664537
    హైదరాబాద్ 9963010243
    జగిత్యాల 9866239255
    జనగాన్ 7680923429
    జయశంకర్ భూపాలపల్లి 9985810455
    జోగులాంబ గద్వాల్ 9440914257
    కామారెడ్డి 9908174871
    కరీంనగర్ 9849087746
    ఖమ్మం 9948707454
    ఖుమారం భీమ్ (ఆసిఫాబాద్) 9492134744
    మెహబూబాబాద్ 9652759857
    మహబూబ్ నగర్ 9963292495
    మంచిర్యాల 7989521850
    మెదక్ 9392334292
    మేడ్చల్-మల్కాజిగిరి 9848250147
    నాగర్ కర్నూలు 9848959988
    నల్గొండ 9908290220
    నిర్మల్ 9441506545
    నిజామాబాదు 9440149492
    పెద్దపల్లి 8332000225
    రాజన్న సిరిసిల్ల 7097557119
    రంగారెడ్డి 9573811956
    సంగారెడ్డి 9989961750
    సిద్ధిపేట 7702943032
    సూర్యాపేట 9985351499
    వికారాబాద్ 9848577030
    వనపర్తి 9059563318
    వరంగల్ రూరల్ 9494787185
    వరంగల్ అర్బన్ 9849014737
    యాదాద్రి భువనగిరి 9849696513

 ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

Matching schemes for sector: Safety Program

Sno CM Scheme Govt
1 Janani Suraksha Yojana CENTRAL GOVT
2 Compensation to Victims of Hit and Run Motor Accident Scheme CENTRAL GOVT

Comments

వ్యాఖ్య

KCR kit 4th stage amount released soon mesage received. But 1st stage amount or any 1 rupie amount from KCR KIT scheme not received. So please take care about this case. This amount who are thefting in middle of process.

వ్యాఖ్య

KCR kit 4th stage amount released soon mesage received. But 1st stage amount or any 1 rupie amount from KCR KIT scheme not received. So please take care about this case. This amount who are thefting in middle of process.

In reply to by Ramya pudhari (సరిచూడ బడలేదు)

స్థిరలంకె

వ్యాఖ్య

First Babu putinapu only 3000₹ vachayi a tarvata em ralevu second papa untindi one rupee kuda ralevu ani documents apply chesa pan card adhar card passport size photo account number

వ్యాఖ్య

నేను ఆడబిడ్డకు జన్మనిచ్చి పధినెలలు అయ్యిఇప టి వరకు ఒక రూపాయ కూడా జామ లేదు ఆధార్ నెం 3296 5293 2306 మధార్ నం P29020104879550

వ్యాఖ్య

i gave birth to my child in private hospital. but still the asha worker took my documents and all the personal details. it's been 10 months but i didm't receive any money under this scheme. is this some kind of scam?

స్థిరలంకె

వ్యాఖ్య

మీరు శ్రీమతి Chandu sulthana కేసిఆర్ కిట్ పథకము నందు ఆధార్ నెం xxxxxxxx056మదర్ నెం 20010034000365 తో నమోదు చేయబడినారు. ఈ పధకము ద్వారా మీకు రావలసిన 3వ,4 వ విడత పైకము రూ 2000, రూ 3000.0 గురించి పరిశీలనకు పంపడం జరిగినది.

వ్యాఖ్య

Baby boy is born july-20-2021.
But Not Having One Amount Also. 12000rs Is Not Having. Anganwadi Is Registered and Bank Account Are Given Also In 3months Pregnancy. Please Clear The Issue. Adress- village Cheeriyal, mandal- keesara- Medchal Dist, 501301.

స్థిరలంకె

వ్యాఖ్య

నేను 2 సంవత్సరాల క్రితం ఈ పథకంలో నమోదు చేసుకున్నాను. ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా రాలేదు లేదా నా దరఖాస్తు స్థితిని నేను తెలుసుకోలేకపోయాను. నెను ఎమి చెయ్యలె?

స్థిరలంకె

వ్యాఖ్య

కేసీఆర్ కిట్ మొత్తం రాలేదు. రిజిస్ట్రేషన్ 1.5 సంవత్సరాల క్రితం జరిగింది. Kcr కిట్ పథకం యొక్క స్థితిని ఎలా తెలుసుకోవాలి.

వ్యాఖ్య

I Am delivered two times have two female babys but amount received Rs.3,000.00 only till now amount not credited in my account from Warangal telangana
96767479XX

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format