రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • రైతులకు ఒక ఎకరానికి, సంవత్సరానికి 10,000/- చొప్పున ఇవ్వబడును :-
    • రైతులకు రబీ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
    • రైతులకు ఖరీఫ్ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
Customer Care
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం
ప్రారంభించిన సంవత్సరం 25 ఫిబ్రవరి 2018.
లక్ష్యం రైతులకు స్వావలంబనను కల్పించి వ్యవసాయానికి అవసరమయ్యే వస్తువుల కొనుగోలులో సహకరించడం.
లాభాలు రైతులకు ఎకరానికి Rs. 10,000/- చొప్పున ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం ఇవ్వబడును.
నోడల్ విభాగం వ్యవసాయ సహకార విభాగం
సబ్స్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి.

పరిచయం

  • రైతు బంధు పథకం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకార పథకం.
  • తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ పథకాన్ని 25 ఫిబ్రవరి 2018 న ప్రారంభించారు.
  • ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు వర్తిస్తుంది.
  • ఈ పథకాన్ని వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అని కూడా అంటారు.
  • ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం రైతుల ఆదాయాన్ని పెంచడం. తద్వారా రైతులకు స్వావలంబన చేకూర్చి వ్యవసాయానికి అవసరమయ్యే వస్తువుల కొనుగోలుకు సహకరించడం.
  • ఈ పథకం ద్వారా, ప్రతి రైతుకు, సంవత్సరంలో ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వబడును.
  • ఈ 10,000/- రూపాయలలో 5,000/- రబీ సీజన్ పంటలకు మరియు 5,000/- ఖరీఫ్ సీజన్ పంటలకు ఇవ్వబడును.
  • కింద ఇవ్వబడిన పంటకు సంబంధించిన వస్తువులకు ఈ ఆర్థిక సహకారం ఇవ్వబడును :-
    • విత్తనాలు.
    • ఫర్టిలైజర్స్.
    • పెస్టిసైడ్స్.
    • కూలీలు.
    • అదనపు పెట్టుబడి.
  • 2018-2019 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి 12,000 కోట్ల బడ్జెట్ ను మంజూరు చేసింది.
  • ఈ పథకం కింద, ఆర్థిక సహకారం రైతులకు ప్రత్యక్షంగా ఇవ్వబడును.
  • ఇది భారతదేశంలో మొదటి ప్రత్యక్ష రైతు పెట్టుబడి మద్దతు పథకం.
  • తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల రైతులకు పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

లాభాలు

  • రైతులకు ఒక ఎకరానికి, సంవత్సరానికి 10,000/- చొప్పున ఇవ్వబడును :-
    • రైతులకు రబీ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
    • రైతులకు ఖరీఫ్ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.

అర్హత

  • రైతులు తెలంగాణ రాష్ట్ర నివాసులై ఉండాలి.
  • చిన్న లేదా సన్న కారు రైతులే ఉండాలి.
  • పంట భూమి రైతు పేరు మీద నమోదయి ఉండాలి.

అనర్హులు

  • వాణిజ్య మరియు సంపన్నులైన రైతులు.
  • కాంట్రాక్టు రైతులు.

అవసరమైన పత్రాలు

  • నివాస ధ్రువీకరణ పత్రం.
  • భూమి యాజమాన్య ధ్రువీకరణ పత్రం.
  • ఆధార్ కార్డు.
  • క్యాస్ట్ సర్టిఫికెట.్ (SC/ST/OBC విభాగానికి చెందిన రైతులు)
  • BPL సర్టిఫికెట్. (BPL విభాగానికి చెందిన రైతులు)
  • బ్యాంకు పాస్ బుక్.

పథకం వివరాలు

  • రైతు బంధు పథకం లేదా వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం 2018-2019 సంవత్సరంలో ప్రారంభించబడింది.
  • ఈ పథకం కింద రైతులకు, సంవత్సరంలో ఎకరానికి ఒక పంటకు 5,000/- చొప్పున ఇవ్వబడును.
  • రైతులు ఈ ఆర్థిక సహకారాన్ని, విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కూలీ, మరియు ఇతర పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.
  • రైతులకు ఈ ఆర్థిక సహకారం బ్యాంకు చెక్కు ద్వారా ఇవ్వబడును.
  • ఈ బ్యాంకు చెక్కుల ద్వారా రైతులు తమ గుర్తింపును నిరూపించుకొని నగదును పొందవచ్చు.
  • రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక బ్యాంకు ఈ పథకం కోసం నియమించబడింది.
  • రైతులు నియమించబడిన బ్యాంకు యొక్క ఏ బ్రాంచీలో అయినా నగదును పొందవచ్చును.
  • బ్యాంకు చెక్కు తో పాటు, తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ బుక్కులను రైతులకు అందజేస్తుంది.
  • ఈ కొత్త పాస్ బుక్కు అత్యంత సురక్షితమైనది. ఇది 17 భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.
  • బ్యాంకు చెక్కు కింద ఇవ్వబడిన వివరాలు కలిగి ఉంటుంది :-
    • పథకం పేరు “రైతుబంధు”.
    • పట్టాదారు పేరు మరియు పట్టాదారు పాస్బుక్ నెంబర్.
    • రెవెన్యూ ఊరు మండలం మరియు జిల్లా.
    • నగదు మొత్తం.
    • వ్యవసాయ కమిషనర్ మరియు డైరెక్టర్ యొక్క సంతకం.
  • ఒకవేళ నగదు మొత్తం 50,000/- లేదా 50,000/- కు మించినట్లయితే, బ్యాంకు రెండు చెక్కులను ఇస్తుంది.
  • బ్యాంకు చెక్కు పట్టాదారునికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కు నామినీలకు ఇవ్వబడదు.

ఎలా లబ్ధి పొందాలి?

  • తహసీల్దారు (MRO) కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించండి.

నియమింపబడ్డ బ్యాంకులు

బ్యాంకు పేరు మండల కౌంట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3398430
ఆంధ్ర బ్యాంక్ 2689156
సిండికేట్ బ్యాంక్ 903696
కార్పొరేషన్ బ్యాంక్ 315277
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 601562
కెనరా బ్యాంక్ 595743
AP గ్రామీణ వికాస్ బ్యాంక్ 1323887
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 945170
ఐడిబిఐ బ్యాంక్ 107002
టి ఎస్ సి ఏ బి 205643

ముఖ్యమైన అప్లికేషన్ పత్రాలు

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

Matching schemes for sector: Agriculture

Sno CM Scheme Govt
1 తెలంగాణ రైతు భరోసా పథకం తెలంగాణ

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format