Highlights
- 4,000 - 15,000/- రూపాయల వరకు నెలవారి పెన్షన్.
Customer Care
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం జిల్లాల వారి సంప్రదింపు వివరాల లిస్టు.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 08662410017.
పథకం వివరాలు |
|
---|---|
పథకం పేరు | ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 13 జూన్ 2024. |
లాభాలు | 4,000 - 15,000/- రూపాయల వరకు నెలవారి పెన్షన్. |
లబ్ధిదారులు | రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు. |
నోడల్ విభాగం | ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి విభాగం. |
సబ్స్క్రిప్షన్ | పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి. |
అప్లై చేసే విధానం | ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్లను ఆఫ్లైన్ మోడ్ ద్వారా పొందవచ్చు. |
పరిచయం
- కొత్తగా ఎన్నుకోబడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం మొదలుపెట్టింది.
- జూన్ 13, 2024 న, ఏపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని” ప్రకటించింది.
- కాకపోతే, ఇది కొత్త పథకం కాదు. వైయస్సార్ కానుక పెన్షన్ పథకం అని పిలువబడే మాజీ ప్రభుత్వం యొక్క పథకం పేరు మరియు లాభాలను ప్రస్తుత ప్రభుత్వం మార్చింది.
- సమాజంలోని బలహీన వర్గాలకు గట్టి మద్దతుదారుగా ఉండడానికి ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటిస్తుంది.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, మునుపు అందజేయబడే పెన్షన్ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం పెంచింది.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందజేయబడే పెన్షన్ 4000/- నుండి 15,000/- మధ్య ఉంటుంది.
- మునుపటి పథకం యొక్క లాభాలు 3,000/- నుండి 10,000/- మధ్య ఉండేవి.
- ప్రకటించబడిన విధంగా, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు పథకం యొక్క లాభాలు జులై 1, 2024 నుండి అందజేయబడతాయి.
- పెంచబడిన పెన్షన్ అమౌంట్ ఏప్రిల్ 1, 2024 నుండి అంచనా వేయబడి, ఏప్రిల్ నుండి జూన్ వరకు మిగిలిన బకాయిలు జూలై 2024 నుండి పంపిణీ చేయబడతాయి.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, పూర్తిగా వికలాంగులైన వ్యక్తులకు 15,000/- నెలవారి పెన్షన్ను ప్రభుత్వం అందజేస్తుంది.
- ప్రస్తుతానికి, పథకం యొక్క అప్డేట్ చేయబడిన లాభాల వివరాలు ప్రభుత్వం తెలియజేసింది.
- పథకం యొక్క అర్హత పరిస్థితులలో లేదా అప్లికేషన్ పద్ధతిలో ఏమైనా మార్పులు ఉన్నాయేమోనని చెక్ చేయాలి.
- అటువంటి వివరాల కోసం, కొన్ని నెలలలో విడుదల చేయబడే పథకం యొక్క వివరణాత్మకమైన మార్గదర్శకాల కొరకు దరఖాస్తుదారులు వేచి ఉండాలి.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్ను ఇంకా సబ్మిట్ చేయని దరఖాస్తుదారులు త్వరలో సబ్మిట్ చేయవచ్చు.
- పథకం లేదా దాని యొక్క అప్డేట్ల కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, యూసర్లు మా పేజీకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
పథకం లాభాలు
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుంది. వారి వివరాలు మరియు పెన్షన్ మొత్తం కింద ఇవ్వబడిన టేబుల్ లో తెలియజేయబడును :-
లబ్ధిదారులు (వర్గం పేరు) పెన్షన్ రేటు వృద్ధాప్య పెన్షన్ Rs. 4,000/- వితంతు. Rs. 4,000/- నేత కార్మికులు. Rs. 4,000/- గీత కార్మికులు. Rs. 4,000/- చేపలు పట్టేవారు. Rs. 4,000/- ఒంటరి మహిళలు Rs. 4,000/- చెప్పులు కుట్టేవారు. Rs. 4,000/- హిజ్రాలు. Rs. 4,000/- ఏఆర్టి( పి ఎల్ హెచ్ ఐ వి). Rs. 4,000/- డప్పు కళాకారులు. Rs. 4,000/- ఇతర కళాకారుల పెన్షన్. Rs. 4,000/- వికలాంగుల పెన్షన్వికలాంగులు Rs 6,000/- కుష్టు వ్యాధిగ్రస్తులు Rs 6,000/- పూర్తి వికలాంగులు Rs. 15,000/- వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు Rs. 15,000/- తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ఆక్సిడెంట్ బాధితులు Rs. 15,000/- దీర్ఘకాలిక వ్యాధి పెన్షన్బైలాటరల్ ఎలిఫెంట్ ఆసిస్- గ్రేడ్ 4 Rs. 10,000/- కిడ్నీ,లివర్, మరియు హార్ట్ మార్పిడి Rs. 10,000/- డయాలసిస్ లో లేని సికెడియు, సి కే డి సిరం క్రియాటినైన్ Rs. 10,000/- డయాలసిస్ లో లేని సికెడియు, సి కే డి Rs. 10,000/- డయాలసిస్ లో లేని సికెడియు, సి కే డి సన్నగా సంకోచించిన కిడ్నీ Rs. 10,000/- ఇతర వర్గాలుప్రైవేటు లేదా ప్రభుత్వ డయాలసిస్ లో ఉన్న సి కే డి యు Rs. 10,000/- సికిల్ సెల్ వ్యాధి Rs. 10,000/- తలసీమియా Rs. 10,000/- తీవ్రమైన హిమోఫిలియా Rs. 10,000/- సైనిక సంక్షేమ పథకాలు Rs. 5,000/- భూమిలేని అమరావతి పేదలు Rs. 5,000/- అభయ హస్తం Rs. 500/-
అర్హత పరిస్థితులు
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అప్లై చేయాలంటే, పథకం నోటిఫికేషన్ లో తెలియజేయబడిన విధంగా, దరఖాస్తుదారులు కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి :-
స్థానిక పౌరులు దరఖాస్తుదారులు తప్పనిసరిగా రాష్ట్ర నివాసులై ఉండాలి. ఇక్కడ ఇవ్వబడిన ఏదో ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి - వృద్ధులు.
- వితంతులు.
- గీత కార్మికులు.
- నేత కార్మికులు.
- ఒంటరి మహిళలు.
- చేపలు పట్టేవారు.
- ఏఆర్టి. (పిఎల్ హెచ్ఐవి)
- చెప్పులు కుట్టేవారు.
- హిజ్రాలు.
- డప్పు కళాకారులు.
- కిడ్నీ వ్యాధితో బాధపడేవారు.
నెలవారీ ఆదాయం - గ్రామీణ ప్రాంతాలు: నెలకు 10,000/- వరకు.
- పట్టణ ప్రాంతాలు: నెలకు 12,000/- వరకు.
భూమి వివరాలు - తడి భూమి: 3 ఎకరాలకు తక్కువ లేదా.
- పొడి భూమి: 10 ఎకరాలకు తక్కువ లేదా.
- తడి పొడి కలిపి, మొత్తం 10 ఎకరాలు.
అనర్హత కేసులు - కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ దారు.
- నాలుగు చక్రాల బండి కలిగిన వారు. (ఆటో, ట్రాక్టర్, టాక్సీ తప్ప)
- నెలవారి విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించరాదు.
- కుటుంబంలోని ఏ సభ్యుడు అయినా ఇన్కమ్ టాక్స్ స్లాబ్ కింద ఉంటే.
- కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ ఏరియాలలో 1000 స్క్వేర్ ఫీట్ల కన్నా ఎక్కువ భూమి ఉంటే.
వయస్సు పరిమితి (వర్గం వారిగా) - వృద్ధులు :-
- ఎస్టీ దరఖాస్తుదారులకు 50 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- ఇతర వర్గాలకు 60 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- వితంతువులు: 18 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- వికలాంగులు: వయస్సు పరిమితి లేదు.
- నేత లేదా గీత కార్మికులు: 50 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- ఏఆర్టి (పిఎల్హెచ్ఐవి): ఏఆర్టి సెంటర్లో 6 నెలలు.
- హిజ్రాలు: 18 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- డయాలసిస్ వ్యక్తులు: వయస్సు పరిమితి లేదు.
- చేపలు పట్టేవారు: 50 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- ఒంటరి మహిళలు :-
- గ్రామీణ ప్రాంతాలు: 30 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- పట్టణ ప్రాంతాలు: 35 సంవత్సరాలు లేదా అంతకుమించి.
- డప్పు కళాకారులు: 50 సంవత్సరాలు.
- చెప్పులు కుట్టేవారు: 40 సంవత్సరాలు.
అవసరమైన పత్రాలు
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్లు సబ్మిట్ చేసే సమయంలో, కింద ఇవ్వబడిన విధంగా దరఖాస్తుదారులు వారి యొక్క పత్రాలను అందజేయాలి :-
- ఆధార్ కార్డు.
- వయసు ధ్రువీకరణ పత్రాలు :-
- బర్త్ సర్టిఫికెట్.
- ఓటర్ ఐడి.
- హై స్కూల్ మార్కుల పత్రం.
- బ్యాంకు ఖాతా వివరాలు.
- రేషన్ కార్డు.
- మొబైల్ నెంబర్.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
- ఇన్కమ్ సర్టిఫికెట్.
- భర్త డెత్ సర్టిఫికెట్. (వితంతు దరఖాస్తుదారులకు)
- సదరం సర్టిఫికెట్. (వికలాంగు దరఖాస్తుదారులకు)
- కోపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రూఫ. (నేత మరియు గీత కార్మిక దరఖాస్తుదారులకు)
- మెడికల్ సర్టిఫికెట్స్.
- పెళ్ళికాని మహిళలకు అఫీడవిట్స్.
అప్లై చేసే పద్ధతి
- భరోసా పెన్షన్ పథకం యొక్క లాభాలను పొందడానికి, దరఖాస్తుదారులు వారి అప్లికేషన్లను ఆఫ్లైన్ లో సబ్మిట్ చేయాలి.
- గ్రామపంచాయతీ లేదా వార్డు సెక్రటేరియట్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్ ఫామ్ ను లబ్ధిదారులు కలెక్ట్ చేసుకోవచ్చు.
- ఈ అప్లికేషన్ ఫామ్ లో, దరఖాస్తుదారులు తప్పనిసరిగా అన్ని ఫీల్డ్ లను పూరించి, మీ యొక్క వర్గం వారిగా పత్రాలను జత చేయాలి.
- గ్రామపంచాయతీ లేదా వార్డు సెక్రటేరియట్లో ఈ అప్లికేషన్ ఫామ్ ను మరియు పత్రాలను సబ్మిట్ చేయాలి.
- ఆ తరువాత, అధికారులు అప్లికేషన్ ఫామ్ యొక్క వివరాలను సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు.
- పరిశీలన పరీక్షను క్లియర్ చేసిన తర్వాత, లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం మంజూరు చేయబడుతుంది.
- సంబంధిత విభాగం పెన్షన్ మొత్తాన్ని ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలోకి పంపిణీ చేస్తుంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం జిల్లాల వారీగా సంప్రదింపు నెంబర్లు
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యొక్క జిల్లాల వారి సంప్రదింపు వివరాలు కింద ఇవ్వబడ్డాయి :-
జిల్లా మొబైల్ నెంబర్ ఇమెయిల్ అల్లూరి సీతారామరాజు 8500358601 pddrdaasr@gmail.com అనకాపల్లి 9000019782 drdaanakapalli@gmail.com అనంతపురం 7799798555 sspatp@gmail.com అన్నమయ్య 9000404848 sspannamayya@gmail.com బాపట్ల 9154813135 ntrbharosabapatla@gmail.com చిత్తూరు 9390504561 ntrbharosachittoor@gmail.com ఈస్ట్ గోదావరి 6304651153 egrjmpensions@gmail.com ఏలూరు 9866656730 pddrdaeluru@gmail.com గుంటూరు 7331169349 ntrbharosaguntur@gmail.com కాకినాడ 9652304176 egdrda@gmail.com డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ 9849901595 konaseemapensions@gmail.com కృష్ణ 9154054220 drdavelugukrishna@gmail.com కర్నూల్ 9866550955 drdakurnool@gmail.com నంద్యాల్ 9866550955 drdanandyal@gmail.com ఎన్టీఆర్ 9154054071 pd.ntrdist@gmail.com పల్నాడు 9121190725 ntrbharosapalnadu@gmail.com పార్వతీపురం మన్యం 8008902438 pddrdapvpmanyam@gmail.com ప్రకాశం 9154395864 ntrbharosaprakasam@gmail.com శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 7207949500 ntrbharosadrdanlr@gmail.com శ్రీ సత్య సాయి 9949088932 sspsssd@gmail.com శ్రీకాకుళం 8008803803 ntrbharosapensionssklm@gmail.com తిరుపతి 9390504605 pddrdatpt@gmail.com విశాఖపట్నం 9866074018 drdavizag@gmail.com విజయనగరం 9866074014 pddrdavzm@gmail.com వెస్ట్ గోదావరి 9949778243 westgodavaridrda@gmail.com వైఎస్ఆర్ 9908263332 ntrbharosaysrkadapa@gmail.com
ముఖ్యమైన లింక్స్
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అధికారిక వెబ్సైట్.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మార్గదర్శకాలు.
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారిక వెబ్సైట్.
సంప్రదింపు వివరాలు
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం జిల్లాల వారి సంప్రదింపు వివరాల లిస్టు.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 08662410017.
- రెండవ అంతస్తు, డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్,
పండిత్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్,
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ - 520001.
Scheme Forum
Person Type | Scheme Type | Govt |
---|---|---|
Matching schemes for sector: Pension
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | వైస్సార్ పెన్షన్ స్కీం | ఆంధ్రప్రదేశ్ |
Matching schemes for sector: Pension
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | Atal Pension Yojana (APY) | CENTRAL GOVT | |
2 | National Pension System | CENTRAL GOVT | |
3 | Pradhan Mantri Laghu Vyapari Mandhan Yojana(PMLVMY) | CENTRAL GOVT | |
4 | Pradhan Mantri Vaya Vandana Yojana | CENTRAL GOVT | |
5 | NPS Vatsalya Scheme | CENTRAL GOVT |
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం
Comments
Thelasammai
Thelasammai
వ్యాఖ్యానించండి