Highlights
- ఏపీ దీపం పథకం కింద, అర్హత కలిగిన కుటుంబాలకు, ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందజేస్తుంది.
Customer Care
- ఆంధ్రప్రదేశ్ దీపం పథకం సంప్రదింపు వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ త్వరలో తెలియజేయబడుతాయి.
పథకం వివరాలు |
|
---|---|
పథకం పేరు | ఆంధ్రప్రదేశ్ దీపం పథకం. |
ప్రారంభించిన సంవత్సరం | 2024. |
లాభాలు | 3 ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు |
లబ్ధిదారులు | రాష్ట్రంలోని అర్హత కలిగిన కుటుంబాలు |
నోడల్ విభాగం | ఇంకా ప్రకటించలేదు |
సబ్స్క్రిప్షన్ | పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి |
అప్లై చేసే విధానం | దరఖాస్తుదారులు దీపం పథకానికి అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలి. |
పరిచయం
- ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, దీపం పథకం అని పిలువబడే ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు పరచడానికి సన్నద్ధంగా ఉంది.
- మీకందరికీ తెలిసిన విధంగా, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని, టిడిపి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.
- ఏపీ దీపం పథకం ప్రకటించిన తర్వాత, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతున్న ఎల్పిజి గ్యాస్ ధరలు తమ బడ్జెట్ కు కలిగించే అంతరాయం నుండి ఉపశమనం పొందాయి.
- తమ కూటమి పార్టీల ద్వారా టిడిపి విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించింది కాబట్టి, లబ్ధిదారులు ఈ పథకం అమలు కొరకు వేచి చూస్తున్నారు.
- ఏపీ ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కావాలంటే, దరఖాస్తుదారులు తప్పనిసరిగా అర్హత మార్గదర్శకాలను కలిగి ఉండాలి.
- కాకపోతే, ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రకటించే సమయంలో వివరణాత్మకమైన అర్హత పరిస్థితులను తెలియజేయలేదు.
- కాబట్టి, పథకం యొక్క వివరణత్మకమైన మార్గదర్శకాలను లబ్ధిదారులు త్వరలో పొందవచ్చు.
- ఈ పథకాన్ని ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లేదా ఏపీ ఉచిత ఎల్పిజి పథకం అని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు.
- ఏపీ దీపం పథకం ప్రకారం, లబ్ధిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు ఉచిత గ్యాస్లు ఉండాలను పొందవచ్చు.
- దీని అర్థం ఏమిటంటే, లబ్ధిదారులు ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.
- రాష్ట్ర పౌరులు తెలుసుకోవాల్సిందేమిటంటే, దీపం పథకం లాభాలు కుటుంబాల గ్యాస్ కనెక్షన్కు మాత్రమే వర్తిస్తాయి, కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ హోల్డర్లకు వర్తించదు.
- ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
- ఈ పథకాన్ని అమలు పరచాలంటే ప్రభుత్వం దానికి ఒక బడ్జెట్ను జారీ చేస్తుంది. వాటి వివరాలు త్వరలో ప్రభుత్వం చేత తెలియజేయబడతాయి.
- ప్రస్తుతానికి, పథకానికి సంబంధించి కొన్ని వివరాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మాకు మరిన్ని వివరాలు అందగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం.
- ఏపీ ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం లేదా దీపం పథకం యొక్క లేటెస్ట్ అప్డేట్లను పొందడానికి, పాఠకులు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
పథకం లాభాలు
- ఏపీ దీపం పథకం కింద, అర్హత కలిగిన కుటుంబాలకు, ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందజేస్తుంది.
అర్హత పరిస్థితులు
- ఏపీ ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం లాభాలను పొందాలంటే, దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి. కాకపోతే, అటువంటి వివరాలను పథకం ప్రకటించే సమయంలో తెలియజేయలేదు. కాబట్టి కింద ఇవ్వబడిన వివరాలు మారవచ్చు. ఈ వివరాలలోని మార్పులు మాకు అందగానే ఇక్కడ అప్డేట్ చేస్తాము :-
- కేవలం రాష్ట్రంలో నివసించే దరఖాస్తుదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
- దరఖాస్తుదారులకు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉన్న కుటుంబ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
- ఒకవేళ కుటుంబాలకు ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం ఒక కనెక్షన్ కు మాత్రమే ఈ పథకం లాభాలు అందజేయబడతాయి.
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఉజ్వల యోజన లబ్ధిదారులై ఉండాలి.
అవసరమైన పత్రాలు
- ఆంధ్రప్రదేశ్ దీపం పథకం లాభాలను పొందాలంటే, లబ్ధిదారులు తప్పనిసరిగా కింద ఇవ్వబడిన పత్రాలను అందజేయాలి :-
- ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు.
- ఆధార్ కార్డు.
- అడ్రస్ ప్రూఫ్.
- పథకం మార్గదర్శకాలలో ఉన్న ఇతర పత్రాలు.
అప్లై చేసే పద్ధతి
- అర్హత కలిగిన లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ దీపం పథకం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- కాకపోతే, ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉన్నహోల్డర్లకు ఈ లాభాలు స్వయం చాలకంగా అందుతాయో లేదా దరఖాస్తుదారులు ఈ పథకానికి అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలియదు.
- రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం ప్రకటించబడింది.
- ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని త్వరలో అమలుపరుస్తుంది.
- ఈ పథకం యొక్క అప్లికేషన్ పద్ధతి వివరాలు మాకు తెలియగానే, మేము ఇక్కడ పొందుపరుస్తాం.
ముఖ్యమైన లింక్స్
- ఆంధ్రప్రదేశ్ దీపం పథకం మార్గదర్శకాలు ప్రభుత్వం చేత త్వరలో విడుదల చేయబడతాయి.
- ఏపీ ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం అప్లికేషన్ ఫామ్ లింక్ అధికారుల చేత త్వరలో విడుదల చేయబడుతుంది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్.
సంప్రదింపు వివరాలు
- ఆంధ్రప్రదేశ్ దీపం పథకం సంప్రదింపు వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ త్వరలో తెలియజేయబడుతాయి.
Scheme Forum
Person Type | Govt |
---|---|
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about ఆంధ్రప్రదేశ్ దీపం పథకం
Comments
GAS
Katta Vaniplam. BRINKAM POST PARAVADAY MD
Want to apply for free gas schemes
I would like to apply for free gas schemes
Deepam gas connection status
Deepam gas connection status
for for free cylinder
for for free cylinder
complete eligibility deepam
complete eligibility deepam
free cylinder deepam apply
free cylinder deepam apply
Free cylnder
Free cylender
Deepam pathakam
Free gas conection
వ్యాఖ్యానించండి