ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం

author
Submitted by shahrukh on Sat, 29/06/2024 - 12:45
ఆంధ్రప్రదేశ్ CM
Scheme Open
Highlights
  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం కింద లబ్ధిదారులు కింద ఇవ్వబడిన లాభాలను పొందుతారు :-
    • అందరూ లబ్ధిదారులకు భీమా సౌకర్యాలు అందజేయబడతాయి.
    • లబ్ధిదారులు సహజంగా మరణిస్తే, 5,00,000/- రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీ అందుతుంది.
    • ఒకవేళ లబ్ధిదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే, లబ్ధిదారులకు 10,00,000/- ఇన్సూరెన్స్ కవరేజీ అందజేయబడుతుంది.
Customer Care
  • ఏపీ చంద్రన్న బీమా పథకం సంప్రదింపు మరియు హెల్ప్ డెస్క్ వివరాలు. (ఇంకా అందుబాటులో లేవు)
పథకం వివరాలు
పథకం పేరు ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2024.
లాభాలు
  • లబ్ధిదారులు ఇన్సూరెన్స్ సౌకర్యాలను పొందుతారు.
  • సహజంగా మరణిస్తే 5 లక్షల ఇన్సూరెన్స్.
  • ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఇన్సూరెన్స్.
లబ్ధిదారులు రాష్ట్ర కార్మికులు
నోడల్ విభాగం ఇంకా ప్రకటించలేదు
సబ్స్క్రిప్షన్ పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి
అప్లై చేసే విధానం అప్లికేషన్ పద్ధతి వివరాలు ఇంకా అందుబాటులో లేవు

పరిచయం

  • ఇటీవల, “చంద్రన్న బీమా పథకం” అని పిలువబడే లబ్ధిదారుల పథకాన్ని, కొత్తగా ఎన్నుకోబడ్డ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది.
  • ఈ పథకం కింద, రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్స్ లాభాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.
  • చంద్రన్న బీమా పథకం ప్రకారం, లబ్ధిదారులు సహజ లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ని పొందుతారు.
  • సహజంగా మరణిస్తే, లబ్ధిదారుల యొక్క నామిని 5,00,000/- రూపాయల మొత్తాన్ని అందుకుంటారు.
  • ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే, లబ్ధిదారులు నియమించిన నామిని 10,00,000/- రూపాయల మొత్తాన్ని అందుకుంటారు.
  • అసంఘటిత కార్మికులు ఒకవేళ మరణిస్తే, వారి కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • మీకు తెలిసిన విధంగా, టిడిపి మరియు కూటమి పార్టీలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో, వారి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించారు.
  • ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత, రాబోయే కొన్ని నెలలలో టిడిపి ఈ పథకాన్ని అమలుపరుస్తుంది.
  • ప్రస్తుతానికి, చంద్రన్న బీమా పథకం గురించి మరిన్ని వివరాలను ప్రభుత్వం తెలియపరచలేదు.
  • కాకపోతే, పథకం యొక్క వివరణత్మకమైన నోటిఫికేషన్ మరియు మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయబడతాయి.
  • చంద్రన్న బీమా పథకం యొక్క అర్హత పరిస్థితులను కలిగిన లబ్ధిదారులు, ప్రభుత్వం తెలియజేసిన పద్ధతిలో అప్లికేషన్లను సబ్మిట్ చేయవచ్చు.
  • రాష్ట్రంలో, 15,000/- రూపాయల నెలవారీ వేతనం అందుకునే అసంఘటిత కార్మిక వర్గానికి చెందిన వారికి ఈ పథకం లాభాలు అందజేయబడతాయి.
  • కనీస నెలవారీ వేతనం వివరాలు తాత్కాలికమైనవి మరియు మార్పులకు లోను కావచ్చు.
  • పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే, మేము ఇక్కడ పొందుపరుస్తాము.
  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం గురించి అప్డేట్లను పొందడానికి ఇక్కడ మా పేజీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం కింద లబ్ధిదారులు కింద ఇవ్వబడిన లాభాలను పొందుతారు :-
    • అందరూ లబ్ధిదారులకు భీమా సౌకర్యాలు అందజేయబడతాయి.
    • లబ్ధిదారులు సహజంగా మరణిస్తే, 5,00,000/- రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీ అందుతుంది.
    • ఒకవేళ లబ్ధిదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే, లబ్ధిదారులకు 10,00,000/- ఇన్సూరెన్స్ కవరేజీ అందజేయబడుతుంది.

అర్హత పరిస్థితులు

  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం లాభాలను పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా అర్హత మార్గదర్శకాలను కలిగి ఉండాలి. కాకపోతే, వివరణాత్మకమైన అర్హత పరిస్థితులు ఇంకా తెలియజేయబడలేదు. కింద ఇవ్వబడిన లిస్టు తాత్కాలికమైనవి మరియు మారవచ్చు :-
    • దరఖాస్తుదారులు అసంఘటిత కార్మికుల వర్గానికి చెంది ఉండాలి.
    • దరఖాస్తుదారుల వయసు 70 సంవత్సరాల లోపు ఉండాలి.
    • దరఖాస్తుదారుల కనీసం నెలవారి వేతనం 15,000/- రూపాయలకు మించి ఉండరాదు .
    • మిగిలిన అర్హత పరిస్థితులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలియజేయబడతాయి.

అవసరమైన పత్రాలు

  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం అప్లికేషన్ ఫాబ్ను సబ్మిట్ చేసే సమయంలో, లబ్ధిదారులు తప్పనిసరిగా కింద ఇచ్చిన పత్రాలను సబ్మిట్ చేయాలి :-
    • ఆధార్ కార్డు.
    • కాస్ట్ సర్టిఫికెట్.
    • ఇన్కమ్ సర్టిఫికెట్.
    • బ్యాంకు ఖాతా వివరాలు.
    • అడ్రస్ ప్రూఫ్.
    • రేషన్ కార్డు.
    • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
    • పథకం మార్గదర్శకాలలో సూచించే విధంగా ఇతర పత్రాలు.

అప్లై చేసే పద్ధతి

  • అర్హత కలిగిన లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకానికి అప్లై చేసుకోవచ్చు.
  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా స్వీకరించబడుతుంది.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసే సమయంలో, దరఖాస్తుదారులు వారి యొక్క వివరాలను మరియు పత్రాలను అందజేయాలి.
  • దరఖాస్తుదారులు వారి వివరాలను మరియు చెల్లుబాటులో ఉన్న పత్రాలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవడం తప్పనిసరి.
  • చంద్రన్న బీమా పథకం అప్లికేషన్ పద్ధతి గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే, ఇక్కడ అప్డేట్ చేస్తాము.

ముఖ్యమైన లింక్స్

  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం మార్గదర్శకాలు (ఇంకా అందుబాటులో లేవు)
  • ఆంధ్రప్రదేశ్ చంద్రన్న బీమా పథకం అప్లికేషన్ లింక్ (ఇంకా అందుబాటులో లేవు)

సంప్రదింపు వివరాలు

  • ఏపీ చంద్రన్న బీమా పథకం సంప్రదింపు మరియు హెల్ప్ డెస్క్ వివరాలు. (ఇంకా అందుబాటులో లేవు)

Matching schemes for sector: Insurance

Sno CM Scheme Govt
1 వైఎస్ఆర్ బీమా పథకం ఆంధ్రప్రదేశ్

Matching schemes for sector: Insurance

Sno CM Scheme Govt
1 Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) CENTRAL GOVT
2 Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) CENTRAL GOVT

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format